గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Sep 16, 2020 , 02:45:07

500 విజయ డెయిరీ పార్లర్లు... మంత్రి తలసాని

500 విజయ డెయిరీ పార్లర్లు... మంత్రి తలసాని

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో పాడిపరిశ్రమ అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ఎంతో కృషిచేస్తున్నారని, ఇందుకు అనేక సంస్కరణలను చేపట్టారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ చెప్పారు. విజయ డెయిరీ ఉత్పత్తులకు బ్రాండింగ్‌ చేస్తామని, సుమారు 500 పార్లర్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మంగళవారం  అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ.. తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో లక్ష లీటర్ల పాల సేకరణ జరిగితే.. అది నేడు 7 లక్షల లీటర్లకు చేరిందని చెప్పారు. 50% సబ్సిడీపై 2.13 లక్షల మంది రైతులకు పాడిపశువులను ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించిందని, ఇప్పటికే 58 వేల వరకు అందజేసిందని అన్నారు. పాడిపశువుల పంపిణీలో 75% ఎస్టీలకు కేటాయించామని వివరించారు. గద్వాలలో త్వరలోనే విజయ డెయిరీని మంజూరుచేస్తామని తెలిపారు. త్వరలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరాలలో రూ.245 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్‌ మెగా డెయిరీని అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెప్పారు.


logo