బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 06, 2020 , 00:32:09

చాక్లెట్ల ఆశచూపి చిన్నారులపై లైంగికదాడి

చాక్లెట్ల ఆశచూపి చిన్నారులపై లైంగికదాడి

  • 15 రోజులుగా వృద్ధుడి దాష్టీకం 
  • చితకబాది పోలీసులకు అప్పగించిన ప్రజలు

ఎడపల్లి: సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించాడో ప్రబుద్ధుడు. మనుమరాలి వయసున్న ఇద్దరు బాలికలపై చాక్లెట్ల ఆశజూపి 15 రోజులుగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలంలోని ఓ గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది. బాధిత కుటుంబీకులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నారాయణ(50) ఇంటి పక్కన గల వేర్వేరు కుటుంబాలకు చెందిన ఇద్దరు ఎనిమిదేండ్ల చిన్నారులను చాక్లెట్లు కొనిస్తానని చెప్పి సమీపంలోని ఓ పాడుబడిన ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఇలా 15 రోజులుగా వారిపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. వీరిలో ఒకరికి కడుపునొప్పి వస్తుందని శనివారం ఓ బాలిక తల్లికి చెప్పింది. సాధారణ కడుపునొప్పి అనుకుని తల్లి ఊరుకున్నది.

ఆదివారం సాయంత్రం సమయంలో మళ్లీ వృద్ధుడు బాలికకు చాక్లెట్ల ఆశ చూపి తీసుకెళ్తుండగా.. అనుమానం వచ్చి సదరు బాలిక తల్లి స్థానికుల సాయంతో అనుసరించింది. బాలికపై వృద్ధుడి దాష్టీకాన్ని గమనించి.. పట్టుకుని చితకబాది పోలీసులకు సమాచారం అందించారు. ఎడపల్లి ఎస్సై సిబ్బందితో అక్కడి చేరుకుని బాలికలను వైద్య పరీక్షల నిమిత్తం బోధన్‌ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. తనతోపాటు మరో బాలికను తీసుకెళ్తాడని చెప్పడంతో ఇరు కుటుంబాల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు. నారాయణను అదుపులోకి తీసుకొని ఎడపల్లి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.  logo