గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 19, 2020 , 01:37:33

చేనేత కళాకారులకు 50% కూలి పెంపు

చేనేత కళాకారులకు 50% కూలి పెంపు

  • లీవరి వెరైటీ క్లాత్‌ కొనుగోలు ధర పెంచిన ప్రభుత్వం
  • స్కూల్‌ యూనిఫాం తయారుచేసే కుటుంబాలకు లబ్ధి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: చేనేత కళాకారులు తయారుచేసే స్కూల్‌ యూనిఫాం(లీవరి వెరైటీ క్లాత్‌) వస్త్రం తయారీధరను భారీగా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. స్కూల్‌ యూనిఫాం తయారుచేసే లీవరి వెరైటీ క్లాత్‌ ధరను 50 శాతం పెంచుతూ ప్రభుత్వ ఆమోదంతో టెస్కో నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో స్కూల్‌ యూనిఫాం తయారుచేసే వేల చేనేత కుటుంబాలకు మేలు జరగనున్నది. ప్రభుత్వ సంక్షేమ స్టల్స్‌లో చదువుతున్న విద్యార్థులకోసం ఏటా 25 లక్షల మీటర్ల లివరీ వెరైటీక్లాత్‌ను కొనుగోలు చేస్తున్నది. కూలి ధరలు తక్కువగా ఉన్నాయన్న విజ్ఞప్తి మేరకు.. టెస్కో పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం షూటింగ్‌ క్లాత్‌మీటర్‌కు రూ.27 చెల్లిస్తుండగా ఇకపై రూ.40.50, షర్టింగ్‌ క్లాత్‌ మీటర్‌కు రూ.24 ఇస్తుండగా ఇకపై రూ.36లు ఇవ్వనున్నారు. చేనేత కళాకారులకు రేట్లు పెరిగినందున స్కూల్‌యూనిఫాం కొనుగోలు చేసే ధరలు కూడా పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ఏడాదికి అదనంగా రూ.2.7 కోట్ల భారం పడనున్నది. ప్రభుత్వ నిర్ణయంపై ఆప్కో మాజీ చైర్మన్‌ మండల శ్రీరాములు హర్షం వ్యక్తంచేశారు.  logo