అన్నంపెట్టే చేతులనే నరికే సంస్కృతి నీది
ఓ మహిళవై ఉండి ఇలాగేనా మాట్లాడేది
నీ కూతలు మహిళాలోకం తలదించుకునేలా ఉన్నయ్
బొడిగె శోభపై భూపాలపల్లి జడ్పీ చైర్మన్ జక్కు శ్రీహర్షిణి ఫైర్
శోభ వ్యాఖ్యలపై కాటారం, మహదేవపూర్ ఠాణాల్లో ఫిర్యాదు
ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
కాటారం, ఏప్రిల్ 3 : ‘ఒక రాజకీ య సభ జరిగినప్పుడు అక్కడ రాజకీయంగానే మాట్లాడితే ఎవ్వరైనా స్వాగతిస్తారు.. కానీ నిన్నటి మంథని సభలో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకురాలు బొడిగె శోభ మాట్లాడిన తీరు గర్హనీయంగా ఉంది. అన్నంపెట్టే చేతులనే న రికే సంస్కృతి నీది.. ఓ మహిళవై ఉండి ఇలాగేనా మాట్లాడేది.. నీ కూతలు మ హిళాలోకం తలదించుకునేలా ఉన్న య్.’ అని భూపాలపల్లి జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి అన్నారు. నీకు రాజకీ య భిక్ష పెట్టింది సీఎం కేసీఆరేనని మరచిపోయి.. ఆయనపై వ్యక్తిగత దూషణలకు దిగడం బాధాకరమన్నారు. కా టారంలోని జడ్పీ క్యాంపు కార్యాలయంలో శనివారం ఆమె మాట్లాడా రు. అంతకుముందు అంబేద్కర్ కూ డలిలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
కేంద్రప్రభు త్వం పెట్రోలు, డీజీల్ ధరలు పెంచుకుంటూ పోతుంటే ప్రజల పక్షాన నోరు మెదపని బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేస్తున్న సీఎం కేసీఆర్ గురించి మాట్లాడడం దారుణమన్నారు. దేశభక్తి ముసుగులో దేశ సం పదనే కార్పొరేట్ శక్తులకు అమ్ముకుంటు న్న బీజేపీ ముసుగు తొలగిపోయిందని, త్వరలోనే ప్రజలు గుణపాఠం చెప్పే రో జులు వస్తాయన్నారు. అనంతరం బొడి గె శోభ వ్యాఖ్యలపై ఎస్ఐ సాంబమూర్తికి ఫిర్యాదు చేశారు. సమావేశంలో పీ ఏసీఎస్ చైర్మన్ చల్లా నారాయణ రెడ్డి, ఎంపీపీ బాన్సోడ రాణీబాయి, ఎంపీటీ సీ మమత, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జక్కు రాకేశ్, మండలాధ్యక్షుడు డోలి అర్జయ్య, మహిళా అధ్యక్షురాలు రత్న సౌజన్య, టీఆర్ఎస్ ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు భూపెల్లి రాజు, వెంకటస్వామి, మందల లక్ష్మారెడ్డి, సడవలి, బాలరాజు, రమేశ్, రాజబాబు, వేణు, సుజాత, శ్రీలక్ష్మి ఉన్నారు.
మహదేవపూర్‌లో..
మహదేవపూర్ : మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభపై కేసు నమోదు చేయాలని టీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు ఎండీ అలీంఖాన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మండలకేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో టీఆర్ఎస్ నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో మహదేవపూర్ ఉపసర్పంచ్ సల్మాన్‌ఖాన్, నాయకులు పవన్, శీలం లక్ష్మణ్, అన్వర్, సయీద్ పాల్గొన్నారు.
ఇవి కూడా చూడండి..
జర్నలిస్టులకు టీకా ఇవ్వండి.. కేంద్రానికి లేఖ
450 మంది టూరిస్టులను రక్షించిన భారత జవాన్లు