శనివారం 04 జూలై 2020
Telangana - Jun 24, 2020 , 09:01:39

నాగపురిలో 50 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

నాగపురిలో 50 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

సిద్దిపేట : అక్రమంగా నిల్వ చేసిన రేషన్‌ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని నాగపురి గ్రామంలో చోటుచేసుకుంది. రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గ్రామ శివారులో సుమారు 50 క్వింటాళ్ల బియ్యాన్ని ఒక గుడిసెలో డంపు చేశారు. ఈ విషయాన్ని గ్రామస్తులు గుర్తించి రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యం డంప్‌ చేసిన వ్యక్తుల ఆచూకీకి దర్యాప్తు చేపట్టారు.


logo