ఆదివారం 12 జూలై 2020
Telangana - May 28, 2020 , 20:57:51

భారీగా అక్రమ తవ్వకాలు..50 లారీల ఇసుక సీజ్

భారీగా అక్రమ తవ్వకాలు..50 లారీల ఇసుక సీజ్

ఖమ్మం : అక్రమంగా నిల్వ ఉంచిన 50 లారీల ఇసుక డంప్‌ను టాస్క్‌ఫోర్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం కాకరవాయి సమీపంలోని పాలేరు వాగు నుంచి అక్రమంగా ఇసుకను తవ్వి..ముజాహితిపురం సమీపంలో 1250 టన్నుల (50 లారీల) ఇసుక డంప్‌ చేశారని పోలీసులకు సమాచారమందింది. దీంతో టాస్క్‌ఫోర్స్‌ సీఐ రవికుమార్‌, ఎస్‌ఐ ప్రసాద్‌ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు.

పాలేరు వాగుపై చెక్‌డ్యామ్‌ నిర్మాణం చేపట్టిన ఓ కాంట్రాక్టర్‌ ఇసుకను నిల్వ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో పట్టుకున్న ఇసుకను సీజ్‌ చేసి..రెవెన్యూ అధికారులకు అప్పగించారు. తహసీల్దారు అరుణ, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ జరిపారు.   ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo