బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Oct 03, 2020 , 15:13:34

సీఎంఆర్ఎఫ్‌కు బ్రాడ్‌రిడ్జ్ కంపెనీ 50 ల‌క్ష‌ల విరాళం

సీఎంఆర్ఎఫ్‌కు బ్రాడ్‌రిడ్జ్ కంపెనీ 50 ల‌క్ష‌ల విరాళం

హైద‌రాబాద్ : కొవిడ్‌–19 నివారణలో భాగంగా సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి బ్రాడ్‌రిడ్జ్ అనే ఐటీ కంపెనీ రూ. 50 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు రూ. 50 ల‌క్ష‌ల చెక్కును ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో మంత్రి కేటీఆర్‌కు బ్రాడ్‌రిడ్జ్ కంపెనీ ప్ర‌తినిధులు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా వారిని మంత్రి కేటీఆర్ అభినందించారు.  

ల‌క్ష హైజిన్ ప్రొడ‌క్ట్స్ అంద‌జేత‌

క‌రోనా వైర‌స్ నివార‌ణ చ‌ర్య‌ల్లో ముందు వ‌రుస‌లో ఉండి ప‌ని చేస్తున్న హెల్త్ కేర్ వ‌ర్క‌ర్స్, పోలీసుల ప‌ట్ల పేటీం, లైఫ్ బాయ్ సోప్‌, యూ వూయ్ కెన్ సంస్థ‌లు మాన‌వ‌త్వాన్ని చాటుకున్నాయి. ఈ మేర‌కు ఒక ల‌క్ష హైజిన్ ప్రొడ‌క్ట్స్ ను మంత్రి కేటీఆర్‌కు ఆ సంస్థ‌ల ప్ర‌తినిధులు అంద‌జేశారు. వారికి కేటీఆర్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.


logo