మంగళవారం 26 జనవరి 2021
Telangana - Jan 08, 2021 , 12:14:54

పేదల జీవితాల్లో ‘డబుల్‌’ వెలుగులు: స్పీకర్ పోచారం

పేదల జీవితాల్లో ‘డబుల్‌’ వెలుగులు: స్పీకర్ పోచారం

కామారెడ్డి: రాష్ట్రంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పేదల జీవితాలకు కొత్త వెలుగులు అందిస్తున్నాయని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జిల్లాలోని ఇబ్రహీంపేటలో కొత్తగా నిర్మించిన 50 డబుల్ బెడ్రూం ఇండ్లను స్వీకర్‌ ప్రారంభించారు. ఇండ్ల తాళాలు లబ్ధిదారులకు అందించారు. పేదలకు గూడు కల్పిస్తున్న సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని చెప్పారు. బాన్సువాడ నియోజకవర్గంలో ప్రతి పేద కుటుంబానికి ఇల్లు కట్టించివ్వడానికి ప్రయత్నం చేస్తానన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించడం సంతోషాన్ని ఇస్తోందని వెల్లడించారు.


అనంతరం బాన్సువాడ పట్టణంలో నూతనంగా నిర్మించిన మిషన్ భగీరథ నూతన కార్యాలయాన్ని, కల్కి చెరువు వద్ద పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన బోటును ప్రారంభించారు. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనంలో నిర్మించనున్న అదనపు తరగతి గదులకు భూమి పూజ నిర్వహించారు.


logo