గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 10, 2020 , 12:23:20

గడ్డి వాము కింద 50 కట్ల పాములు

గడ్డి వాము కింద 50 కట్ల పాములు

శాలిగౌరారం : నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఆకారం గ్రామంలోని ఓ ఇంట్లో సుమారు 50 కట్ల పాములు కనబడడంతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. వివరాలు.. ఆకారం గ్రామానికి చెందిన చిరునాగుల గోపయ్య ఇంట్లో ఉన్న గడ్డివాము నుంచి గురువారం సాయంత్రం ఒక్కసారిగా 40 నుంచి 50 కట్లపాములు బయటికొచ్చాయి. పాములను చూసి షాక్‌కు గురైన యజమాని కేకలు వేస్తూ చుట్టుపక్కల వారిని పిలువడంతో సుమారు 10 పాములను చంపేశారు. మిగతావి రాళ్లు, బొరియలు, చెట్ల పొదళ్లలోకి దూరాయని స్థానికులు తెలిపారు. అవి బయటికొచ్చి ఎప్పుడు ఎవరిని కాటు వేస్తాయోనని, కట్ల పాములు చాలా ప్రమాదకరమని స్థానికులు భయపడుతున్నారు. అయితే గడ్డివాము ఏడాదిగా పేర్చి ఉందని, దాని కింద బొరియలు కూడా ఉండడంతో ఇటీవల కురిసిన వర్షాలకు పాములు అందులో చేరి పిల్లలు చేసి ఉండవచ్చునని ఇంటి యజమాని అభిప్రాయపడుతున్నాడు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo