సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 16, 2020 , 16:52:10

మెదక్‌లో ఘోర ప్రమాదం : ఐదుగురు మహిళలు మృతి

మెదక్‌లో ఘోర ప్రమాదం : ఐదుగురు మహిళలు మృతి

మెదక్‌ : జిల్లాలోని కొల్చారం మండలం చిన్నఘన్‌పూర్‌ గ్రామ సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన డీసీఎం, ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులను సంగారెడ్డి జిల్లా పసల్‌వాది గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. సంగారెడ్డి నుంచి డీసీఎంలో ఏడుపాయలకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
logo