మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 04, 2020 , 01:10:32

5 వేల ఐసీయూ బెడ్లు రెడీ

5 వేల ఐసీయూ బెడ్లు రెడీ

  • కేసులు పెరిగినా చికిత్సకు ముందస్తు ఏర్పాట్లు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణలో పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో బాధితులు ఎంతమంది వచ్చినా చికిత్స అందించేలా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. అవసరమైన మందులు, పరికరాలు, దవాఖానల్లో బెడ్ల సామర్థ్యం పెంపు వంటివి చేపట్టింది. కరోనా చికిత్సలో ప్రధానంగా ఉపయోగించే పీపీఈ కిట్లు 7.5 లక్షలు, ఎన్‌- 95 మాస్కులు 11.50 లక్షలు, అజిత్రోమైసిన్‌ మందులు 75 లక్షలు, హెచ్‌సీక్యూ మందులు 48 లక్షలు, త్రీ లేయర్‌ మాస్కులు 50 లక్షలు సిద్ధంగా ఉంచింది. ప్రస్తుతం పూర్తిస్థాయి కొవిడ్‌-19 చికిత్స అందిస్తున్న గాంధీతోపాటు ఇతర దవాఖానల్లో 5 వేల బెడ్లు ఏర్పాట్లుచేస్తున్నది. గచ్చిబౌలిలోని టిమ్స్‌లో అన్ని సౌకర్యాలు కల్పించింది. టిమ్స్‌లో పనిచేసేందుకు 662 మందిని నియమించనుంది.

దవాఖానల్లో ఐసీయూ బెడ్లు..

దవాఖానలు
ఐసీయూ బెడ్లు  
గాంధీ దవాఖాన
1,500
కింగ్‌ కోఠి దవాఖాన
300 
చెస్ట్‌ దవాఖాన
100
ఎంజీఎంహెచ్‌, వరంగల్‌
150
సరోజినీ కంటి దవాఖాన
150
గచ్చిబౌలి స్పోర్స్‌ కాంప్లెక్స్‌
1,500
13 జిల్లా దవాఖానలు
1,300
మొత్తం
5,000


logo