గురువారం 04 జూన్ 2020
Telangana - May 02, 2020 , 17:28:27

ముందస్తు ఇంటిపన్ను చెల్లించిన వారికి రాయితీ

ముందస్తు ఇంటిపన్ను చెల్లించిన వారికి రాయితీ

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌, పురపాలక సంఘాల్లో ముందస్తు ఆస్తిపన్ను చెల్లించిన వారికి రాయితీ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2020-21 ఏడాది ఆస్తిపన్ను ఈ నెల 31లోగా చెల్లించే వారికి 5 శాతం ఇంటిపన్నులో రాయితీ ఇవ్వనున్నారు. పాతబకాయిలతో పాటు ఈ ఏడాది ఆస్తిపన్నూ చెల్లించిన వారికి రాయితీ వర్తిస్తుంది. ఏడాదికి రూ.30వేల లోపు ఆస్తిపన్ను కట్టే ఇంటి యజమానులకే రాయితీ వర్తిస్తుందని తెలిపారు. 


logo