ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 04, 2020 , 19:52:52

ఐదుగురు డాక్టర్లు, ఓ రోగికి కరోనా పాజిటివ్‌

ఐదుగురు డాక్టర్లు, ఓ రోగికి కరోనా పాజిటివ్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా బారిన పడుతున్న వైద్య సిబ్బంది సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. హైదరాబాద్‌లోని ప్రముఖ దవాఖాన నిమ్స్‌లో ఈ రోజు ఆరుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇందులో కార్డియాలజీ విభాగంలో పనిచేస్తున్న నలుగురు రెసిడెంట్‌ డాక్టర్లు ఉండగా, ఒక ప్రొఫెసర్‌, నెఫ్రాలజీ విభాగంలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి ఉన్నారు. నిమ్స్‌లో ఈ రోజు 70 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి పాజిటివ్‌ వచ్చింది. 

రాష్ట్రంలోని వివిధ హాస్పిటళ్లలో పనిచేస్తున్న 36 మంది వైద్యులు, ముగ్గురు ల్యాబ్‌ టెక్నీషియన్లు కరోనా బారినపడ్డారు. ఇందులో గాంధీ హాస్పిటల్‌, ఉస్మానియా దవాఖాన, నిమ్స్‌, పేట్లబురుజు హాస్పిటల్‌ ఉన్నాయి. తాజాగా ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో 12 మంది పీజీ విద్యార్థులు  కరోనా పాజిటివ్‌గా తేలారు. దీంతో వారితోపాటు చదువుతున్న సుమారు 250కిపైగా విద్యార్థులను స్వీయ నిర్బంధంలో ఉండాలని అధికారులు సూచించారు.


logo