శనివారం 30 మే 2020
Telangana - May 18, 2020 , 01:37:23

కేడీసీసీబీ నుంచి 5,902 మందికి రుణమాఫీ

కేడీసీసీబీ నుంచి 5,902 మందికి రుణమాఫీ

కరీంనగర్ : కరీంనగర్‌ కేంద్ర సహకార బ్యాంకు నుంచి 2018లో 25 వేల చొప్పున పంట రుణాలు తీసుకున్న 5,902 మంది రైతులకు 9.44 కోట్లు మాఫీ వర్తించినట్లు బ్యాంక్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌ రావు తెలిపారు. ఈ మొత్తాలను ఆయా రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ఆయన వెల్లడించారు. కేడీసీసీబీకి చెందిన 67 శాఖలు, 127 ప్రాథమిక వ్యవసాయ సరహకార సంఘాల ద్వారా 2018 డిసెంబర్‌ 11 వరకు 76,943 మంది రైతులు 450.38 కోట్లు రుణాలు తీసుకున్నారని, ఇందులో 25 వేల లోపు 12,681 మంది రైతులు 18.92 కోట్లు, 25,001 నుంచి 50 వేల వరకు 19,401 మంది రైతులు 70.71 కోట్లు, 50,001 నుంచి 75 వేల వరకు 16,593 మంది రైతులు 98.74 కోట్లు, 75,001 నుంచి లక్ష వరకు 28,268 మంది రైతులు 262.00 కోట్ల పంట రుణాలు తీసుకున్నారని చెప్పారు. వీరందరికీ రుణ మాఫీ వర్తిస్తుందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల సంఖ్య 209 ప్రకారం ప్రస్తుతం 5,902 మందికి రుణమాఫీ వర్తిసుందని ఆయన తెలిపారు. మాఫీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.logo