ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 06, 2020 , 08:23:54

రద్దీ మార్గాల్లో 48 ప్రత్యేక రైళ్లు

రద్దీ మార్గాల్లో 48 ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌-ఎర్నాకులం, హైదరాబాద్‌-తిరుచిరాపల్లి మార్గాల్లో 48 ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేసినట్టు దక్షిణ మధ్య రైల్వే గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్‌-ఎర్నాకులం-హైదరాబాద్‌ మార్గంలో 24 ప్రత్యేక రైళ్లు మార్చి 12 నుంచి మే 28 వరకు నడుస్తాయి. ఇవి నల్లగొండ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కట్పడి, జోలార్‌పెట్టాయ్‌, సాలెం, ఎరోడ్‌, తిరుపూర్‌, కోయంబత్తూర్‌, పాల్ఘాట్‌, ఒట్టపాలెం, తిరుసూర్‌, అలువ స్టేషన్లలో ఆగుతాయి. హైదరాబాద్‌-తిరుచిరాపల్లి-హైదరాబాద్‌ మార్గంలో 24 ప్రత్యేక రైళ్లు మార్చి 9 నుంచి మే 25 మధ్య నడుస్తాయి. ఈ రైళ్లు నల్లగొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు, కట్పడి, వెల్లూరు కంటోన్మెంట్‌, తిరువన్నామలయ్‌, విల్లుపురం, అరియలూరు, శ్రీరంగం స్టేషన్లలో ఆగుతాయి.


logo