గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 16, 2020 , 08:03:56

జూరాల‌కు పోటెత్తిన వ‌ర‌ద‌.. 48 గేట్లు ఎత్తిన అధికారులు

జూరాల‌కు పోటెత్తిన వ‌ర‌ద‌.. 48 గేట్లు ఎత్తిన అధికారులు

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌: ఉమ్మ‌డి మ‌హ‌బూన‌గ‌ర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీ వ‌రద‌ పోటెత్తుతున్న‌ది. ప్రాజెక్టు ఇప్ప‌టికే పూర్తిస్థాయిలో నిండ‌టంతో వ‌చ్చిన నీటిని వ‌చ్చిన‌ట్లు దిగువ‌కు విడుద‌ల చేస్తున్నారు. ఎగువ‌న విస్తారంగా వ‌ర్షాలు కురియ‌డంతో ప్రాజెక్టులోకి 5.47 ల‌క్ష‌ల క్యూసెక్యుల నీరు వ‌చ్చిచేరుతున్న‌ది. దీంతో 48 గేట్లు ఎత్తి 6.30 ల‌క్ష‌ల క్యూసెక్కుల నీటిని వ‌దులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమ‌ట్టం 1045 అడుగులు కాగా, ప్ర‌స్తుతం 1,401 అడుగుల నీటిమ‌ట్టం ఉన్న‌ది. జ‌లాశ‌యంలో ప్ర‌స్తుతం 5.699 టీఎంసీల నీరు నిల్వ ఉన్న‌ది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామ‌ర్థ్యం 9.657 టీఎంసీలు. ప్రాజెక్టులోకి భారీగా వ‌ర‌ద వ‌చ్చిచేరుతుండ‌టంతో జూరాల ప‌రీవాహ‌క ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల‌ను అధికారులు అప్ర‌మ‌త్తం చేశారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo