మంగళవారం 07 జూలై 2020
Telangana - Apr 16, 2020 , 12:35:23

నమస్తే కరోనా.. క్షమించు.. వెళ్లిపో.. వీడియో

నమస్తే కరోనా.. క్షమించు.. వెళ్లిపో.. వీడియో

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. కరోనా వైరస్‌ పేరు వినగానే ప్రజలు గజగజ వణికిపోతున్నారు. కరోనా మా దరి చేరొద్దని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. కరోనా వైరస్‌ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. ఓ పెద్దాయన కూడా కరోనా వైరస్‌పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. నమస్తే కరోనా.. క్షమించు.. వెళ్లిపో.. అనే ప్లకార్డును సైకిల్‌పై ఏర్పాటు చేసుకుని ప్రతి రోజు 30 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు. 

హైదరాబాద్‌కు చెందిన 47 ఏళ్ల దినేష్‌ గుప్తా ప్రతి రోజు 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించి.. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, అప్రమత్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా దినేష్‌ గుప్తా మాట్లాడుతూ.. ఏడాది పొడవునా అన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే కరోనా వైరస్‌ను నియంత్రించగలం అని చెప్పారు. మన పూర్వీకులు తప్పనిసరిగా ముఖానికి కాటన్‌ గుడ్డలు కట్టుకునే వారని గుర్తు చేశారు. ముఖానికి మాస్కులు ధరించడం అనేది మనిషి ప్రథమ కర్తవ్యం అని ఆయన తెలిపారు. తాను సామాన్య మానవులకు కరోనాపై అవగాహన కల్పించి అప్రమత్తం చేస్తున్నానని స్పష్టం చేశారు. 
logo