మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 04, 2020 , 13:25:11

ఆ 45 మందికి కరోనా సోకలేదు : గాంధీ ఆస్పత్రి

ఆ 45 మందికి కరోనా సోకలేదు : గాంధీ ఆస్పత్రి

హైదరాబాద్‌ : దుబాయ్‌ నుంచి బెంగళూరుకు వచ్చిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చిన విషయం విదితమే. ఈ ఉద్యోగితో కలిసిమెలిసి తిరిగిన వారి సంఖ్య 88 అని ఆరోగ్య శాఖ నిర్ధారించింది. ఇందులో 45 మందిని నిన్న గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరందరికి కరోనా వైరస్‌ సోకలేదని గాంధీ వైద్యులు స్పష్టం చేశారు. 45 మందిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశామని వెల్లడించారు. వీరంతా 14 రోజుల పాటు బయటకు రాకుండా తమ నివాసాల్లోనే ఉండాలని సూచించినట్లు డాక్టర్లు చెప్పారు. అయితే గాంధీ ఐసోలేషన్‌ వార్డులో కరోనా బాధితుడికి చికిత్స అందిస్తున్న వైద్యుడికి కూడా ఈ వైరస్‌ సోకినట్లు తెలుస్తోంది. వైద్యుడి రక్త నమూనాలను పుణె ల్యాబ్‌కు పంపించారు. ఆ ఫలితాలు ఇవాళ వచ్చే అవకాశం ఉంది. ఒక వేళ డాక్టర్‌కు కరోనా పాజిటివ్‌ వస్తే.. తెలంగాణలో నేరుగా వ్యాధి బారిన పడిన తొలి వ్యక్తిగా నమోదు అవుతారు. 


logo
>>>>>>