శనివారం 06 జూన్ 2020
Telangana - May 20, 2020 , 15:24:10

22న 45 బస్తీ దవాఖానాలు ప్రారంభం

22న 45 బస్తీ దవాఖానాలు ప్రారంభం

హైదరాబాద్‌ : ఈ నెల 22న గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 45 బస్తీ దవాఖానాలు ప్రారంభిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రకటించారు. హైదరాబాద్‌లో 22, మేడ్చల్‌ జిల్లాలో 15, రంగారెడ్డిలో 5, సంగారెడ్డిలో మూడు బస్తీ దవాఖానాలు ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం గ్రేటర్‌ పరిధిలో 123 బస్తీ దవాఖానాలు ఉన్నాయన్నారు. ఈ దవాఖానాలతో ప్రతి రోజూ 10 వేల మందికి వైద్య సేవలు అందుతున్నాయని చెప్పారు. నూతన బస్తీ దవాఖానాలతో అదనంగా 4 వేల మందికి వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. బస్తీ దవాఖానాలో వైద్యుడు, నర్సు, సహాయకుడు ఉంటారని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పేర్కొన్నారు. 


logo