శనివారం 30 మే 2020
Telangana - May 19, 2020 , 21:33:51

రాష్ట్రంలో మరో 42 కరోనా పాజిటివ్ కేసులు

రాష్ట్రంలో మరో 42 కరోనా పాజిటివ్ కేసులు

హైదరాబాద్ : ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.  ఇవాళ రాష్ట్రంలో కొత్తగా 42 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 34 కేసులు, మరో 8 మంది వలస కూలీలకు కరోనా సోకినట్లు వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బాధితుల సంఖ్య 1634కు చేరింది. కాగా 38 మంది మరణించారు. కరోనా నుంచి కోలుకొని ఈ రోజు 9 మంది డిశ్చార్జి అయ్యారు. మొత్తంగా ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకొని 1011 మంచి డిశ్చార్జి అవ్వగా.. 585 మంది చికిత్స పొందుతున్నారు.


logo