గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 17, 2020 , 16:47:41

40 క్వింటాళ్ల బియ్యం అంద‌జేసిన డిప్యూటీ స్పీక‌ర్

40 క్వింటాళ్ల బియ్యం అంద‌జేసిన డిప్యూటీ స్పీక‌ర్

హైద‌రాబాద్ : తెలంగాణ శాస‌న‌స‌భ డిప్యూటీ స్పీక‌ర్ పద్మారావు గౌడ్ వ‌ర‌ద ముంపు బాధితుల ప‌ట్ల మాన‌వ‌త్వం చాటుకున్నారు. త‌న సొంత డ‌బ్బుల‌తో సికింద్రాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని బౌద్ధ న‌గ‌ర్ డివిజ‌న్‌లో ముంపు బాధితుల‌కు 40 క్వింటాళ్ల బియ్యాన్ని పంపిణీ చేశారు. చంద్ర‌బాబు న‌గ‌ర్ ఏరియాలో 1000 కుటుంబాల‌కు నిత్య‌వ‌స‌రాలు అంద‌జేశారు. 

సికింద్రాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో 277 మంది ల‌బ్ధిదారుల‌కు రూ. 2.60 కోట్ల విలువైన‌ క‌ల్యాణ‌ల‌క్ష్మి, షాదీముబార‌క్‌, సీఎంఆర్ఎఫ్ చెక్కుల‌ను ప‌ద్మారావు గౌడ్ అంద‌జేశారు. 


logo