ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 03, 2020 , 01:29:21

‘రైతువేదిక’కు రూ.40 లక్షల వితరణ

‘రైతువేదిక’కు రూ.40 లక్షల వితరణ

  • కేటీఆర్‌ సతీమణి శైలిమ తాత పేరిట నిర్మాణం
  • రామాయంపేటలో భూమిపూజ చేసిన ఎమ్మెల్యే  

రామాయంపేట: రైతువేదిక నిర్మాణానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ సతీమణి శైలిమ తాత దివంగత నూలి హనుమంతరావు పేరిట కుటుంబ సభ్యులు రూ.40 లక్షల విరాళమిచ్చారు. ఈ మేరకు మంగళవారం మెదక్‌ జిల్లా రామాయంపేటలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి రైతువేదిక భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. 500మంది రైతులు సమావేశమయ్యేలా.. ఈ భవన నిర్మాణ పనులు నెలరోజుల్లో పూర్తిచేస్తామన్నారు. దీన్ని మంత్రి కేటీఆర్‌ చేతులమీదుగా ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. 


logo