గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Aug 24, 2020 , 03:23:06

ఒక్క రోజే 40వేల టెస్టులు

ఒక్క రోజే 40వేల టెస్టులు

  • 9 లక్షలు దాటిన పరీక్షలు
  • కొత్త కేసులు 2,384

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రం లో కరోనా టెస్టులు వేగంగా నిర్వహిస్తున్నా రు. శనివారం అత్యధికంగా 40,066 నిర్ధారణ పరీక్షలుచేయగా, మొత్తం టెస్టుల సంఖ్య 9,31,839కి చేరుకున్నట్టు ఆదివారం విడుదలచేసిన బులెటిన్‌లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. పాజిటివ్‌ కేసుల సంఖ్య లక్ష దాటింది. శనివారం 2,384 కేసులు కలుపుకొని ఇప్పటివరకు 1,04,249 కేసులు నమోదయ్యా యి. రికవరీ రేటు సైతం పెరుగుతున్నది. కరోనాకు తోడు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా 11 మంది మరణించారు.

ఎన్నారై దవాఖానకు అచ్చెన్నాయుడు 

ఈఎస్‌ఐ స్కాంలో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని శనివా రం రాత్రి ఏపీలోని మంగళగిరి ఎన్నారై దవాఖానకు తరలించారు. అనార్యోగంతో బాధపడుతున్న ఆయనకు కరోనా పాజిటివ్‌ రావడంతో మెరుగైన చికిత్స కోసం ఎన్నారై హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. 

డాక్టర్‌ నరేశ్‌ భార్యకు గెజిటెడ్‌ ఉద్యోగం

కరోనా బాధితులకు చికిత్స చేస్తూ.. అదే వైరస్‌ బారినపడి మృతిచెందిన కొత్తగూడెం జిల్లాలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ నరేశ్‌ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు. డాక్టర్‌ నరేశ్‌ భార్యకు గెజిటెడ్‌ స్థాయి ఉద్యోగం ఇచ్చేందుకు సీఎం కేసీఆర్‌ అంగీకరించారని తెలిపారు. ఆ కు టుంబానికి నగదు పరిహారం కూడా ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. వైద్య సం ఘాల నేతలు ఆందోళన చెందాల్సిన అవస రం లేదని మంత్రి తెలిపారు. కేంద్రం ఇస్తున్న ఎక్స్‌గ్రేషియాతోపాటు రాష్ట్ర ప్రభు త్వం కూడా ఆర్థిక సహాయం అందిస్తుందని ఈటల ప్రకటించారు. 

రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు

వివరాలు
శనివారం
మొత్తం
పాజిటివ్‌ కేసులు
2,384
1,04,249
డిశ్చార్జి
1,851
80,586
మరణాలు11755

చికిత్సలో  ఉన్నది -


logo