ఆదివారం 07 జూన్ 2020
Telangana - Mar 29, 2020 , 06:37:34

కరోనా నేపథ్యంలో జలమండలిలో 4 టాస్క్‌ఫోర్స్‌ బృందాలు

కరోనా నేపథ్యంలో జలమండలిలో 4 టాస్క్‌ఫోర్స్‌ బృందాలు

హైదరాబాద్ : ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అత్యవసరంగా స్పందించేందుకు వీలుగా జలమండలిలో 4 టాస్క్‌ఫోర్స్‌ బృందాలను అందుబాటులో ఉంచుతున్నట్లు జలమండలి ఎండీ ఎం. దానకిషోర్‌ తెలిపారు. బోర్డు ప్రధాన కార్యాలయం కేంద్రంగా ఈ బృందాలు పనిచేస్తాయని ఆయన తెలిపారు. ఇందులో 100 మంది లైన్‌మెన్లు, సివరేజీ సిబ్బంది, 1జీఎం, ఇద్దరుడీజీఎంలు, నలుగురు మేనేజర్లు, ఒక ఎస్సై, పోలీసు సిబ్బంది ఉంటారని, నగరంలో ఎక్కడ సమస్య తలెత్తినా ఈ బృందాలు పరిష్కరిస్తాయన్నారు. శనివారం జలమండలి జీఎంలతో ఎండీ టెలికాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు.

ప్రతిమేనేజర్‌ కింది స్థాయి ఉద్యోగుల ఆరోగ్యం, యోగక్షేమాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. కార్యాలయ ఆవరణలో సోడియం హైపోక్లోరైట్‌ రసాయనాన్ని చల్లించాలని, ఉద్యోగులంతా శానిటైజర్‌, మాస్క్‌లను వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సిబ్బంది రవాణా వసతులు లేక ఇబ్బందులు పడితే.. బోర్డు నుంచే రవాణా సదుపాయం కల్పించాలని,  ఒక్కో జీఎం తమ పరిధిలో అత్యవసర పరిస్థితుల్లో సేవలందించేందుకు 20 మంది సిబ్బందిని అదనంగా గుర్తించాలన్నారు. మంచినీరు, ట్యాంకర్ల సరఫరా పంపిణీలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. మంచినీరు, కలుషితనీరు ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలన్నారు.


logo