బుధవారం 15 జూలై 2020
Telangana - Jun 17, 2020 , 00:33:05

ప్రతి రైతుకు 4 లక్షల రుణమివ్వండి

ప్రతి రైతుకు 4 లక్షల రుణమివ్వండి

  • కేంద్ర ఆర్థిక మంత్రికి రాష్ట్ర రుణ విముక్తి కమిషన్‌ లేఖ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రైతులు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు దీర్ఘకాలిక, పంట రుణాల కింద ఒక్కొక్కరికీ రూ.4 లక్షలు మంజూరుచేయాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర రుణ విముక్తి కమిషన్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్లు లేఖ రాశారు. కరోనా నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీలో రూ.2 లక్షల కోట్లను రైతులకు రుణాల రూపంలో అందించాలని నిర్ణయించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ మొత్తం రైతుకు నేరుగా చేరేందుకు దీర్ఘకాలిక, పంట రుణాలను అందించాలని కోరారు. రైతులు ప్రైవేట్‌గా అప్పు లు తీసుకొని భారీగా వడ్డీలు చెల్లించాల్సి వస్తున్నదని లేఖలో పేర్కొన్నారు. ప్రైవేట్‌గా రూ.లక్ష అప్పుగా తీసుకొంటే ఏడాదికి రూ.36 వేల వరకు వడ్డీ చెల్లిస్తున్నారని చెప్పారు. రైతులకు బ్యాంకులే రుణాలు ఇస్తే వడ్డీ కింద కేవలం రూ.11 వేలు మాత్రమే చెల్లించాల్సి వచ్చేదని తెలిపారు. 


logo