బుధవారం 30 సెప్టెంబర్ 2020
Telangana - Sep 16, 2020 , 14:13:46

అమీర్‌పేట చెన్నై షాపింగ్ మాల్‌కు 4 ల‌క్ష‌ల జ‌రిమానా

అమీర్‌పేట చెన్నై షాపింగ్ మాల్‌కు 4 ల‌క్ష‌ల జ‌రిమానా

హైద‌రాబాద్ : న‌గ‌రంలో అక్ర‌మ హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు, బ్యాన‌ర్ల‌పై జీహెచ్ఎంసీ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. నిబంధ‌న‌లు ఉల్లంఘించిన షాపింగ్ మాల్స్‌కు భారీ జ‌రిమానా విధించింది. అమీర్‌పేటలోని చెన్నై షాపింగ్ మాల్‌కు రూ. 4 ల‌క్ష‌ల జ‌రిమానా, వీఆర్‌కే సిల్స్క్‌కు రూ. 2 ల‌క్ష‌లు, ఎస్సార్ న‌గ‌ర్ బ‌జాజ్ ఎల‌క్ర్టానిక్స్ కు రూ. ల‌క్ష జ‌రిమానా విధించింది జీహెచ్ఎంసీ. అక్ర‌మంగా ఏర్పాటు చేసే హోర్డింగ్‌లు, బ్యాన‌ర్ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌కు జీహెచ్ఎంసీ ఉన్న‌తాధికారులు ఆదేశాలు జారీ చేశారు.


logo