శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 23, 2020 , 01:30:45

పాపం.. దీక్షిత్‌

పాపం.. దీక్షిత్‌

  • తెలిసినవాడే బాలుడి ఉసురు తీశాడు
  • కిడ్నాప్‌ చేసిన కొన్ని గంటల్లోనే ఘోరం
  • గొంతునులిమి, తగులబెట్టిన దుండగుడు
  • డబ్బుకోసం మెకానిక్‌ సాగర్‌ ఘాతుకం
  • ఈజీమనీకోసం మెకానిక్‌ సాగర్‌ ఘాతుకం
  • మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి, ఎంపీ కవిత విచారం

దీక్షిత్‌ కిడ్నాప్‌ కథ విషాదాంతమైంది. తెలిసినవాడే ఈజీ మనీకోసం బాలుడిని కిడ్నాప్‌చేసి ఉసురు తీశాడు. వెంట తీసుకెళ్లిన రెండు గంటల వ్యవధిలోనే నిందితుడు ఈ ఘోరానికి తెగబడ్డాడు. చీకటి పడ్డాక ఇంటికి వెళ్దామని ఏడుపు అందుకోవడంతో ఎక్కడ పట్టుబడిపోతానో అనే భయంతో దుండగుడు బాలుడి గొంతునులిమి ఊపిరి తీశాడు. అనంతరం పెట్రోల్‌ పోసి తగులబెట్టాడు. తమ కొడుకు క్షేమంగా ఇంటికిచేరాలని దేవుళ్లను పేరుపేరునా వేడుకున్న ఆ తల్లి నిరీక్షణ ఫలించలేదు. ఈ నెల 18న సాయంత్రం నుంచి గురువారం ఉదయం 6 వరకు 84 గంటలపాటు కండ్లల్లో వత్తులేసుకొని క్షణమొక యుగంలా గడిపిన ఆ తల్లిదండ్రులకు, ఎంత డబ్బు అయినా ఇచ్చేందుకు సిద్ధపడ్డ వారికి కడుపుకోతే మిగిలింది.


మహబూబాబాద్‌, నమస్తే తెలంగాణ: మహబూబాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన కుసుమ దీక్షిత్‌రెడ్డి (9)ని ఈజీ మనీకోసం పరిచయస్తుడే అపహరించి హత్యచేయడం సంచలనం సృష్టించింది. దీక్షిత్‌ను కిడ్నాప్‌చేసిన ఆగంతకుడు మం ద సాగర్‌ కొన్ని గంటల్లోనే హత్యచేసినట్టు మహబూబాబాద్‌ ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. గురువారం మహబూబాబాద్‌ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఘటన వివరాలను వెల్లడించారు. పట్ట ణంలోని కృష్ణకాలనీకి చెందిన టీన్యూ స్‌ చానల్‌ రిపోర్టర్‌ కుసుమ రంజిత్‌రెడ్డి, వసంత దంపతుల పెద్ద కొడుకు దీక్షిత్‌ (9) నాలుగో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 18న సాయం త్రం 6 గం టల సమయంలో ఇంటిముందు ఆడుకుంటుండగా ఓ వ్యక్తి వచ్చి బైక్‌పై తీసుకెళ్లాడు. అదేరోజు రాత్రి 9.15 గంటలకు కిడ్నాపర్‌ నుంచి బాలుడి తల్లిదండ్రులకు బెదిరింపు కాల్‌ రాగా, బాధితు లు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. 

విచారణలో భాగంగా కలెక్టరేట్‌ వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా బాలుడిని శనిగపురం గ్రామానికి చెందిన మంద సాగర్‌ కిడ్నాప్‌చేసినట్టు తేలిం ది. రంజిత్‌రెడ్డి స్వస్థలం కూడా శనిగపురం కావడంతో అదే వీధిలోని మెకానిక్‌ అయిన సాగర్‌తో పరిచయం ఉన్నది ఈక్రమంలో బాలుడు దీక్షిత్‌ తో సాగర్‌ పరిచయం పెంచుకున్నాడు. కిడ్నాప్‌ సమయంలో సాగర్‌ బైక్‌పై రంజిత్‌రెడ్డి ఇంటి ముందుకురాగానే తెలిసినవ్యక్తే కావడంతో బాలుడు అతడితో వెళ్లిపోయాడు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు బైక్‌ నంబర్‌ తెలుసుకొని శనిగపురంలో ఉన్న సాగర్‌ ఇంటికి వెళ్లి గురువారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కేసముద్రం మండ లం అన్నారం శివారు దానమయ్య గుట్టపై బాలుడి గొంతు నులిమి చంపి, పెట్రోల్‌ పోసి దహనంచేసినట్టు ఒప్పుకున్నాడు. బాబును గుట్టపైకి తీసుకెళ్లాక రాత్రి సమయంలో ఇంటికి పో దామని ఏడవటంతో ఎవరైనా చూస్తే తనకు ఇబ్బ ందని భావించిన సాగర్‌ దారుణానికి పాల్పడ్డాడు

రంజిత్‌రెడ్డికి పలువురి పరామర్శ

దీక్షిత్‌ హత్య విషయం తెలిసి పలువురు ప్రముఖులు అతడి తల్లిదండ్రులు రంజిత్‌రెడ్డి, వ సంతలను ఫోన్‌లో పరామర్శించారు. టీన్యూస్‌ ఎండీ, రాజ్యసభసభ్యుడు సంతోష్‌కుమార్‌ ఫోన్‌లో మా ట్లాడారు.రంజిత్‌ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. మంత్రి ఎర్రబెల్లి రంజిత్‌రెడ్డిని ఓదార్చా రు. నిందితుడిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ కోటిరెడ్డికి సూచించారు. మంత్రి సత్యవతి రాథోడ్‌, మహబూబాబాద్‌ ఎంపీ మా లోతు కవిత.. రంజిత్‌రెడ్డి కుటుంబానికి తమ ప్రగా ఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌, ఎస్పీ కోటిరెడ్డిలు గుట్టపై బాలుడి మృతదేహాన్ని చూసి చలించిపోయారు. డోర్నకల్‌ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌..రంజిత్‌రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు. 


బాలుడి అంత్యక్రియలు పూర్తి

కిడ్నాప్‌నకు గురైన దీక్షిత్‌ అంత్యక్రియలు గురువారం సాయంత్రం శనిగపురంలో పూర్తయ్యాయి. జనం భారీగా తరలివచ్చారు. బాలుడిని హత్యచేసిన గుట్ట సమీపంలో మడుపుగల్‌ గ్రామస్తులు హంతకుడిని ఇదే స్థలంలో ఎన్‌కౌంటర్‌చేయాలని ధర్నాచేయగా వారిని పోలీసులు శాంతింపజేశారు.

ప్రత్యేక యాప్‌ ద్వారా ఇంటర్నెట్‌ కాల్‌

పట్టణంలో ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయో ముందే గమనించిన నిందితు డు వాటికి చిక్కకుండా జాగ్రత్త పడ్డాడు. పట్టణంలోని తాళ్లపూసపల్లి రోడ్డులో బాబును తీసుకొని వెళ్తుతుండగా కలెక్టరేట్‌ సమీపంలో రోడ్డుపై ఉన్న సీసీ కెమెరాలో రికార్డయింది. బాబును కిడ్నాప్‌చేసి రూ. 45 లక్షలు డిమాండ్‌చేస్తే ఎంతో కొంత వస్తుందని భావించాడు. గుట్టపైకి వెళ్లాక చీకటి పడటం, బాలుడు ఏడవడంతో అత డు బతికుంటే తనకు ఇబ్బంది అని కిడ్నాప్‌చేసిన రెండు గంటల్లో నే గొంతు నులిమి చంపాడు. రాత్రి 9.15 గంటలకు ఫోన్‌చేసి డబ్బు డిమాండ్‌చేయడంతో బాబు బతికే ఉన్నాడని భావించారు. ప్రత్యేక యాప్‌ ద్వారా ఇంటర్నెట్‌ కాల్‌చేస్తూ కిడ్నాపర్‌ ము ప్పుతిప్పలు పెట్టాడు. ఈ నాలుగురోజుల్లో 23 మంది అనుమానితులను విచారించగా, మంద సాగర్‌ ఒక్కడే ఈ దారుణానికి పాల్పడ్డాడని తేలింది.  ఇంటర్నెట్‌ కాల్‌ను ఛేదించడం కాస్త ఆలస్యమై బా లుడు దక్కలేదని, ఇందుకు తీవ్ర దిగ్భ్రాం తి వ్యక్తంచేస్తున్నానని ఎస్పీ చెప్పారు.