ఆదివారం 31 మే 2020
Telangana - May 14, 2020 , 01:16:53

మాస్క్‌ లేనివారిపై 4,719 కేసులు

మాస్క్‌ లేనివారిపై 4,719 కేసులు

  • అత్యధికంగా హైదరాబాద్‌లో 1,315 మందిపై.. 
  • సీసీటీవీల ద్వారా గుర్తించి కేసులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రభుత్వం పలుమార్లు హెచ్చరించినా ముఖానికి మాస్క్‌లేకుండా రోడ్లపైకి వస్తున్నవారిపై పోలీసులు కొరడా ఝలిపిస్తున్నారు. తమనెవరూ చూడటం లేదన్న ధైర్యంతో, నిర్లక్ష్యంగా రోడ్లపైకి వస్తున్నవారిని సీసీ కెమెరాల ద్వారా గుర్తిస్తున్న అధికారులు బ్లూకోల్ట్స్‌, పెట్రోకార్‌ గస్తీ సిబ్బందిని రంగంలోకి కేసులు నమోదుచేస్తున్నారు. డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌, సెక్షన్‌ 51(బి) కింద కేసులు నమోదు చేస్తున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. ఈ చట్టం కింద ఈ నెల 7 నుంచి బుధవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా మాస్కులు లేనివారిపై 4,719 కేసులు నమోదు చేసినట్టు డీజీపీ కార్యాలయం తెలిపింది. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,315మందిపై కేసులు నమోదైనట్టు పేర్కొంది. కేసులు నమోదైన వారికి కోర్టు ద్వారా రూ.1000 జరిమానా విధించనున్నారు. మాస్క్‌లేకుండా బయటికి వస్తే కేసులు తప్పవని, ప్రతి ఒక్కరూ విధిగా ముఖానికి మాస్క్‌లు పెట్టుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.


logo