శనివారం 16 జనవరి 2021
Telangana - Jan 10, 2021 , 21:02:15

ఎన్టీపీసీ రామ‌గుండంలో 3కె, 6కె వాకథాన్‌

ఎన్టీపీసీ రామ‌గుండంలో 3కె, 6కె వాకథాన్‌

పెద్దపల్లి : నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌(ఎన్టీపీసీ)-రామ‌గుండం స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ ఆదివారం 3కె, 6కె, వాకథాన్‌, మారథాన్‌ పోటీలను నిర్వహించింది. ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు టౌన్‌షిప్‌లోని ఎంజీ స్టేడియంలో ఆదివారం ఈ పోటీలను నిర్వహించింది. ఎన్టీపీసీ రామగుండం చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ సునీల్‌ కుమార్‌ జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పోటీల్లో పాల్గొన్నారు.

కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ 45 ఏళ్ల దిగువ, 44 ఏగువ క్యాటగిరిలుగా విభజించారు. కార్యక్రమం అనంతరం విజేతలకు సునీల్‌ కుమార్‌, ఇతర ఉన్నతాధికారులు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సునీల్‌ కుమార్‌ మాట్లాడుతూ..  జీవితంలో ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండేందుకు ఆటలు ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తాయన్నారు. మరి ముఖ్యంగా కొవిడ్‌ సంక్షోభంలో ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు.