శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 17, 2020 , 03:19:05

మీట నొక్కండి.. ఏదెక్కడో తెలుసుకోండి

మీట నొక్కండి.. ఏదెక్కడో తెలుసుకోండి

  • 3డీ మోడల్‌లో సికింద్రాబాద్‌ స్టేషన్‌
  • పదో నంబరు ప్లాట్‌ఫాంపై ఏర్పాటు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌.. దక్షిణమధ్య రైల్వే జోన్‌ ప్రధాన కేంద్రం ఇది. పది ప్లాట్‌ఫాంలను కలిగిన ఈ స్టేషన్‌ ప్రపంచస్థాయి వసతులతో ప్రయాణికులకు సేవలు అందిస్తున్నది. తాజాగా, ఈ స్టేషన్‌కు సంబంధించిన 3డీ మోడల్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఒకే చోట స్టేషన్‌ మొత్తాన్ని చూసే విధంగా, ఏ వసతి ఎక్కడుందో తెలుసుకునేలా దీన్ని స్టేషన్‌లోని పదో నంబరు ప్లాట్‌ఫాంపై ఏర్పాటు చేశారు. చూడముచ్చటగా ఉన్న ఈ 3డీ మోడల్‌ ద్వారా.. స్టేషన్‌లో ప్రయాణికులకు అందుబాటులో ఉన్న వివిధ రకాల వసతులు, సౌకర్యాల ప్రదేశాలను తెలుసుకోవచ్చు. త్రీడీ డిస్‌ప్లేలో 24 బటన్‌లు ఉంటాయి. ప్రతి బటన్‌ ఆయా వసతికి అనుసంధానించి ఉంటుంది. ప్రయాణికులు తమకు కావాల్సిన సౌకర్యానికి సంబంధించిన బటన్‌ నొక్కితే ఆ వసతికి చెందిన స్క్రోలింగ్‌ సూచన వస్తుంది. ఆ వసతి ఉన్న చోట రెడ్‌ లైట్‌ మెరుస్తూ ఫ్లాట్‌ఫాంపై ఎక్కడుందో చూపిస్తుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కాజీపేట డిజిట్‌ లోకోషేడ్‌ సిబ్బంది అభివృద్ధి చేశారు. సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్య అభినందించారు. స్టేషన్‌ నుంచి ప్రతి రోజు 240 ప్రయాణికుల రైళ్లు వెళ్తుంటాయని, వీటిలో 1.80లక్షల మంది ప్రయాణిస్తుంటారని జీఎం తెలిపారు. logo