శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 11, 2020 , 01:09:56

జర్నలిస్టులకు 37లక్షల సాయం

జర్నలిస్టులకు 37లక్షల సాయం

  • కరోనా సోకిన 221 మందికి అందజేశాం
  • మీడియా అకాడమి చైర్మన్‌ అల్లం నారాయణ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా బారిన పడుతున్న జర్నలిస్టులకు అండగా నిలుస్తున్నామని, అన్నివిధాలా ఆదుకుంటున్నామని మీడి యా అకాడమి చైర్మన్‌ అల్లం నారాయణ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తాజాగా వివిధ జిల్లాలకు చెందిన 21 మందికి వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని, మరో ముగ్గురిని హోంక్వారంటైన్‌లో ఉండాల్సిందిగా వైద్యాధికారులు సూచించారని తెలిపారు. వైరస్‌ సోకిన 21 మంది జర్నలిస్టులకు రూ.20 వేల చొప్పున రూ.4.2 లక్షలు, హోంక్వారంటైన్‌లో ఉన్న ముగ్గురికి రూ.10 వేల చొప్పున రూ.30 వేలు ఆర్థికసాయం అందించినట్టు వివరించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నిర్ధారణ అయిన 149 మంది జర్నలిస్టులకు రూ.29.80 లక్షలు, హోంక్వారంటైన్‌లో ఉన్న 72 మందికి రూ.7.2 లక్షలు కలిపి మొత్తం రూ.37 లక్షలు ఆర్థికసాయం అందించామని తెలిపారు. వైరస్‌ సోకిన, క్వారంటైన్‌లో ఉన్న జర్నలిస్టులు ప్రభుత్వ వైద్యులు ధ్రువీకరించిన రిపోర్టులు అకాడమి కార్యాలయానికి పంపాలని సూచించారు. వివరాలను మీడియా అకాడమి వాట్సాప్‌ నంబర్‌ 8096677444కు పంపాలని, పూర్తి వివరాల కోసం మేనేజర్‌ లక్ష్మణ్‌కుమార్‌ సెల్‌ నంబర్‌ 9676647807లో సంప్రదించాలని కోరారు.logo