సోమవారం 23 నవంబర్ 2020
Telangana - Oct 31, 2020 , 19:38:13

సిద్దిపేటలో ఇప్పటి వరకు రూ.37.29లక్షలు సీజ్‌ : సీపీ

సిద్దిపేటలో ఇప్పటి వరకు రూ.37.29లక్షలు సీజ్‌ : సీపీ

సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేటలో జిల్లాలో ఇప్పటి వరకు రూ.37,28,830 సీజ్‌చేసినట్లు పోలీస్‌ కమిషనర్‌ జోవియల్‌ డేవిస్‌ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో 304.09 లీటర్ల లిక్కర్‌ను స్వాధీనం చేసుకున్నామని, దాని విలువ రూ.1.57లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో శనివారం నాటికి 139 కేసులు నమోదు చేసి 1123 మందిని బైండోవర్‌ చేసినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించిన ఆరుగురిపై కేసు నమోదు చేశామని, లైసెన్స్‌ కలిగిన ఐదు ప్రైవేటు తుపాకులను సంబంధిత పోలీస్‌స్టేషన్లలో డిపాజిట్‌ చేసినట్లుచెప్పారు.

అలాగే మెదక్‌ జిల్లాలో రూ.20,70,960 సీజ్‌ చేశామని, 51.675 లీటర్ల లిక్కర్‌ను పట్టుకున్నట్లు చెప్పారు. దుబ్బాక బైపోల్స్‌ నేపథ్యంలో మెదక్‌ జిల్లాలో 41 కేసులు నమోదు చేసి, 171 మందిని బైండోవర్‌ చేశామని సీపీ చెప్పారు. ఎన్నికల సమయంలో ఎవరైనా నియమావళిని ఉల్లంఘిస్తే.. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ వాట్సాప్ నంబర్‌ 79011 00100లో సంప్రదించాలని సూచించారు. అలాగే దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల పోలీస్ నోడల్ అధికారి ఏసీపీ బాలాజీ 7901640499, సిద్దిపేట ఏసీపీ విశ్వప్రసాద్ 9490617009, గజ్వేల్ ఏసీపీ నారాయణ 8333998684, తూప్రాన్ డీఎస్పీ కిరణ్ కుమార్ 9490617008, కంట్రోల్ రూం 8333998699, డైల్ 100కు సమాచారం అందించాలని కోరారు.