శుక్రవారం 10 జూలై 2020
Telangana - Jun 15, 2020 , 01:27:40

హైదరాబాద్‌లో 350 బస్తీ దవాఖానలు

హైదరాబాద్‌లో 350 బస్తీ దవాఖానలు

  • ట్విటర్‌లో ఐటీ మంత్రి కేటీఆర్‌ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌లో 350 బస్తీ దవాఖానల ను ఏర్పాటుచేయనున్నట్టు ఐటీ, మున్సిపల్‌శాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. ప్రస్తుతం 168 బస్తీ దవాఖానలు ఉన్నాయని, వాటిద్వారా లక్షల మందికి వైద్యసేవలు, వ్యాక్సినేషన్‌, మందులను అందిస్తున్నామని ట్విట్టర్‌ లో వెల్లడించారు. వీటిసంఖ్యను 350కి పెంచి సేవలను విస్తృతంచేసేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. సీజనల్‌ వ్యాధుల నివారణకు అందరూ కృషిచేయాలని ప్రతిఆదివారం పది గంటలకు పది నిమిషాలపాటు పరిసరాలను శుభ్రంచేసుకోవాలని పిలుపునిచ్చారు.


logo