గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Nov 03, 2020 , 11:27:40

దుబ్బాక ఉపఎన్నిక‌.. 11 గంట‌ల వ‌ర‌కు 34.33 % పోలింగ్ న‌మోదు

దుబ్బాక ఉపఎన్నిక‌.. 11 గంట‌ల వ‌ర‌కు 34.33 % పోలింగ్ న‌మోదు

సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నిక‌కు పోలింగ్ ప్ర‌క్రియ ప్ర‌శాంతంగా కొన‌సాగుతోంది. ఉద‌యం 11 గంట‌ల వ‌ర‌కు 34.33 శాతం పోలింగ్ న‌మోదైంది. సాధార‌ణ ఓట‌ర్ల‌కు సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ఓటేసేందుకు అనుమ‌తి ఇవ్వ‌నున్నారు. సాయంత్రం 5 నుంచి 6 గంట‌ల వ‌ర‌కు కొవిడ్ బాధితుల‌కు ఓటేసేందుకు అవ‌కాశం ఇవ్వ‌నున్నారు. మొత్తం 315 పోలింగ్ కేంద్రాల వ‌ద్ద ఓట‌ర్లు బారులు తీరారు. కొవిడ్ నిబంధ‌న‌లు పాటించేలా అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. స‌మ‌స్యాత్మ‌క‌మైన 85 పోలింగ్ కేంద్రాల వ‌ద్ద పోలీసులు భారీగా మోహ‌రించారు. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా పోలీసులు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఈ ఉప ఎన్నిక‌లో మొత్తం 23 మంది అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్నారు.