ఆదివారం 31 మే 2020
Telangana - May 10, 2020 , 20:08:15

తెలంగాణలో కొత్తగా 33 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 33 కరోనా కేసులు

హైదరాబాద్‌: తెలంగాణలో ఆదివారం మరో 33 మందికి కరోనా వైరస్‌ సోకింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే కొత్తగా 26 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మరో ఏడుగురు వలస కూలీలు వైరస్‌ బారినపడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,196కి చేరింది. ప్రస్తుతం 415 మంది కరోనా బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 30 మంది కరోనా వల్ల చనిపోయారు. కరోనా నుంచి కోలుకొని 751 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 


logo