సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Aug 28, 2020 , 14:46:40

న‌గ‌రంలో కొత్త‌గా 320 పార్కులు, 50 థీమ్ పార్కులు : మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌

న‌గ‌రంలో కొత్త‌గా 320 పార్కులు, 50 థీమ్ పార్కులు : మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌

హైద‌రాబాద్ : న‌గ‌ర‌వాసుల‌కు ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణాన్నిఅందించేందుకు కొత్త‌గా 320 పార్కులు, 50 థీమ్ పార్కుల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు హైద‌రాబాద్ న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ తెలిపారు. మ‌ంత్రి కేటీఆర్ ఆదేశాల మేర‌కు హైద‌రాబాద్‌లోని అన్ని పార్కుల్లో జీహెచ్ఎంసీ వారం రోజుల‌పాటు క్లీన్‌నెస్ డ్రైవ్ చేప‌ట్టింది. ఈ సంద‌ర్భంగా బంజారాహిల్స్‌లోని గ్రీన్ వ్యాలీలోని సీడ‌బ్ల్యూఏ పార్కుల్లో చేప‌ట్టిన‌ క్లీన్‌నెస్ డ్రైవ్‌ను మేయ‌ర్ అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలించారు.

సీఎం కేసీఆర్ ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా మంత్రి కేటీఆర్ ఆదేశాల‌తో హైద‌రాబాద్‌ను హ‌రిత న‌గ‌రంగా తీర్చిదిద్దేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు ఈ సంద‌ర్భంగా తెలిపారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో 900 పార్కులు ఉన్నాయన్న ఆయ‌న నిరుప‌యోగంగా ఉన్న పార్కుల‌కు పూర్వ‌వైభ‌వం తీసుకురానున్న‌ట్లు చెప్పారు. పార్కుల్లో వాకింగ్ ట్రాక్‌లు, ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేస్తామ‌న్నారు. గ్రేట‌ర్ ప‌రిధిలో శిథిలావ‌స్థ‌కు చేరిన భ‌వ‌నాల‌ను కూల్చివేయ‌నున్న‌ట్లు తెలిపారు. అనుమ‌తిలేని అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేద‌న్నారు. 

తాజావార్తలు


logo