శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 09, 2020 , 21:18:45

రాష్ట్రంలో కొత్తగా 31 కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 31 కరోనా కేసులు

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 31 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,163కి పెరిగింది. ఈ ప్రాణాంతక వైరస్‌తో ఇవాళ ఒకరు మరణించారు. దీంతో మృతుల సంఖ్య 30కి చేరింది. అదేవిధంగా కరోనా నుంచి కోలుకుని 24 మంది దవాఖాన నుంచి ఈ రోజు డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 751 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 382 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.


logo