బుధవారం 20 జనవరి 2021
Telangana - Jan 12, 2021 , 10:49:02

రాష్ర్టంలో కొత్త‌గా 301 క‌రోనా కేసులు

రాష్ర్టంలో కొత్త‌గా 301 క‌రోనా కేసులు

హైద‌రాబాద్ : తెలంగాణ‌లో కొత్త‌గా 301 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు వైద్యారోగ్య శాఖ వెల్ల‌డించింది. గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనాతో ఇద్ద‌రు మృతి చెందారు. రాష్ర్టంలో ఇప్ప‌టి వ‌ర‌కు 2,90,309 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 4,524 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా నుంచి 2,84,217 మంది కోలుకోగా, నిన్న 293 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. తెలంగాణ‌లో క‌రోనా మృతుల సంఖ్య 1,568 మందికి చేరింది.  ప్ర‌స్తుతం హోం ఐసోలేష‌న్‌లో 2,459 మంది ఉన్నారు. కొత్త‌గా జీహెచ్ఎంసీ ప‌రిధిలో 58 కేసులు న‌మోదు అయ్యాయి. 


logo