బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 09, 2020 , 02:18:06

గోదావరి.. పర్యాటక దరి

గోదావరి.. పర్యాటక దరి
  • గోదావరి టూరిజం ప్రాజెక్టుకు 300 కోట్లు

తెలంగాణ ప్రభుత్వం రూ.300 కోట్లతో గోదావరి టూరిజం ప్రాజెక్టును అభివృద్ధి చేయబోతున్నది. గోదావరి నదీజలాల వినియోగంలో పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్న సర్కారు.. దేశం మెచ్చుకొనే రీతిలో ప్రాజెక్టులను నిర్మించింది. ఆయా ప్రాజెక్టులు, రిజర్వాయర్లు గోదావరి నీటితో కళకళలాడుతూ పర్యాటకుల మనసుదోచేలా ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. దీన్ని ఆధారంగా చేసుకొని రాష్ట్రంలో పర్యాటకరంగం అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొత్త ఆలోచనకు శ్రీకారంచుట్టారు. రూ.300 కోట్లతో గోదావరి టూరిజం ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఇప్పటికే దీనిపై పర్యాటకశాఖ అధికారులతో సమీక్షించారు. సాధ్యాసాధ్యాలు, ఇతర అంశాలపై పలుశాఖల అధికారులు కసరత్తు చేస్తున్నారు.


logo
>>>>>>