బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 10, 2020 , 22:01:59

కొత్త‌గూడెంలో క‌రోనా క‌ల‌క‌లం.. 30 మంది జ‌వాన్ల‌కు పాజిటివ్

కొత్త‌గూడెంలో క‌రోనా క‌ల‌క‌లం.. 30 మంది జ‌వాన్ల‌కు పాజిటివ్

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం : భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో క‌రోనా వైర‌స్ కేసులు పెరిగిపోతున్నాయి. 151వ బెటాలియ‌న్ కు చెందిన 30 మంది సీఆర్పీఎఫ్ జ‌వాన్ల‌కు క‌రోనా పాజిటివ్ నిర్దార‌ణ అయిన‌ట్లు వైద్యాధికారులు వెల్ల‌డించారు. చ‌ర్ల స‌రిహ‌ద్దులో క‌లివేరు వ‌ద్ద బెటాలియ‌న్ ఉంది. వివిధ రాష్ర్టాల‌కు చెందిన జ‌వాన్లు అంద‌రూ రెండు వారాల క్రితం బెటాలియ‌న్ లో రిపోర్టు చేశారు.

గురువారం రోజు 23 మంది జ‌వాన్ల‌కు పాజిటివ్ రాగా, శుక్ర‌వారం మ‌రో ఏడుగురికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. క‌రోనా సోకిన జ‌వాన్లను చికిత్స నిమిత్తం హైద‌రాబాద్ కు త‌ర‌లించారు. 151వ బెటాలియ‌న్ లో శానిటేష‌న్ ప‌నులు ముమ్మ‌రంగా కొన‌సాగుతున్నాయి. క‌రోనా క‌ట్ట‌డి కోసం ప్ర‌తి ఒక్క‌రూ మాస్కు ధ‌రించి.. భౌతిక దూరం పాటించాల‌ని జిల్లా అధికారులు విజ్ఞ‌ప్తి చేశారు.


logo