సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 03, 2020 , 20:58:04

బోల్తా పడ్డ ట్రాక్టర్..ముగ్గురు మహిళలు మృతి

బోల్తా పడ్డ ట్రాక్టర్..ముగ్గురు మహిళలు మృతి

భద్రాద్రికొత్తగూడెం :  భద్రాద్రికొత్తగూడెం జిల్లా చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టు సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు ఆదివాసీ మహిళలు మృతిచెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని వెంటనే చర్ల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఛత్తీస్ గఢ్ రాష్ట్రం జీడిపల్లి గ్రామానికి చెందిన ఆదివాసీలు ట్రాక్టర్ పై చర్లకు వచ్చి.. బియ్యం బస్తాలు, ఇతర నిత్యావసర సరుకులు కొనుగోలు చేసి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

మృతులను లచ్చిమి, రాధ, లచ్చుగా గుర్తించారు. మృతుల బంధువుల రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 
logo