శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 06, 2020 , 17:27:53

ముగ్గురు అక్కాచెల్లెళ్ల హత్య!

ముగ్గురు అక్కాచెల్లెళ్ల హత్య!

కామారెడ్డి : బాన్సువాడ మండలం తాడ్కోల్‌  గ్రామంలో విషాదం నెలకొంది. రాజారామ్‌ దుబ్బ చెరువులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతదేహాలు బయటపడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు చెరువు వద్దకు చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. మృతులను అఫీయా(10), మహీన్‌(9), జోయా(7)గా పోలీసులు గుర్తించారు. అయితే తండ్రి ఫయాజ్‌.. ఈ ముగ్గురిని హత్య చేసి చెరువులో పడేసి ఉండొచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫయాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ముగ్గురు చిన్నారుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


logo