e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home News కొత్తగా 3 లక్షల 93 వేల రేషన్ కార్డులు మంజూరు : మంత్రి ఎర్రబెల్లి

కొత్తగా 3 లక్షల 93 వేల రేషన్ కార్డులు మంజూరు : మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్‌ : రాష్ట్రంలో 8 లక్షల 65 వేల 430 లబ్ధిదారులకు కొత్తగా 3 లక్షల 93 వేల రేషన్ కార్డులను మంజూరు చేశామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి, రాయపర్తి, తొర్రూరు మండల కేంద్రలలో సోమవారం లబ్ధిదారులకు రేషన్ కార్డులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
వరంగల్ రూరల్ జిల్లాలో ప్రస్తుతం 2 లక్షల 19 వేల రేషన్ కార్డులున్నాయని ఆయన తెలిపారు. దీనికి తోడుగా 5 వేల 740 రేషన్ కార్డులను మంజూరు చేశామని ఆయన తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలో ప్రస్తుతం కొత్తగా 6 వేల రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

రాష్ట్రంలో గత ఏడేండ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలలో లక్షా 32 వేల మందికి ఉద్యోగాలిచ్చమన్నారు. కొత్తగా మరో 50 వేల ఉద్యోగాల కల్పనకు త్వరలోనే నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి..

ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జులుం

ఛత్తీస్‌గఢ్ పోలీసులకు చిక్కిన టైగర్ హుంగా

పిల్లలతో కలిసి ఈత కొట్టిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

Tokyo Olympics: చ‌రిత్ర సృష్టించిన 13 ఏళ్ల నిషియా

గంభీర్‌కు చుక్కెదురు.. స్టే ఇవ్వ‌లేమ‌న్న సుప్రీం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana