మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Aug 01, 2020 , 01:19:51

లోదుస్తుల్లో 3 కిలోల బంగారం

లోదుస్తుల్లో 3 కిలోల బంగారం

  • శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో స్వాధీనం 

శంషాబాద్‌ నమస్తే తెలంగాణ: వందేభారత్‌ మిషన్‌ విమానాల్లో వచ్చిన 11 మంది ప్రయాణికులు లోదుస్తుల్లో బంగారం తీసుకొస్తూ    చిక్కారు. శుక్రవారం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అంతర్జాతీయ విమానం నుంచి దిగిన 11 మందిపై అనుమానంతో కస్టమ్స్‌ అధికారులు తనిఖీచేశారు. లోదుస్తుల్లో 3.11 కిలోల బంగారం బిస్కెట్లు పట్టుబడ్డాయి. వీటి విలువ రూ.కోటి 66 లక్షలు ఉంటుందని అంచనా. నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు.  


logo