ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 24, 2020 , 02:48:29

రాష్ట్రంలో కొత్తగా 879 కేసులు

రాష్ట్రంలో కొత్తగా 879 కేసులు

  • జీహెచ్‌ఎంసీలో 652 మందికి కరోనా
  • ముగ్గురి మృతి, 219 మంది డిశ్చార్జి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా కేసులు ఏరోజుకారోజు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. మంగళవారం కొత్తగా 879 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. ఇందులో అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే 652 రికార్డయ్యాయి. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 112, రంగారెడ్డి 64, వరంగల్‌ రూరల్‌ 14, కామారెడ్డి 10, వరంగల్‌ అర్బన్‌ 9, జనగామ 7, నాగర్‌కర్నూల్‌ 4, సంగారెడ్డి, మంచిర్యాల, మహబూబాబాద్‌ జిల్లాల్లో 2 చొప్పున, మెదక్‌ జిల్లాలో ఒక కేసు నమోదయ్యాయి. వైరస్‌ కారణంగా చికిత్సపొందుతూ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 63,249 నిర్ధారణ పరీ క్షలు నిర్వహించగా, 9,553 పాజిటివ్‌గా తేలాయి. ఇప్పటివరకు 4,224 మంది డిశ్చార్జి అయి నట్టు వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో పేర్కొన్నది.

ఢిల్లీ తెలంగాణ భవన్‌లో ఉద్యోగికి కరోనా

ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో పనిచేసే ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అప్రమత్తమైన తెలంగాణ, ఏపీ రెసిడెంట్‌ కమిషనర్లు గౌరవ్‌ ఉప్పల్‌, భావనా సక్సేనా భవన్‌తోపాటు ఉద్యోగుల నివాసాలన్నింటినీ శానిటైజ్‌చేయించారు. వైరస్‌ సోకిన ఉద్యోగిని ప్రజారోగ్య సిబ్బంది దవాఖానకు పంపించారు. ఆ ఉద్యోగి ఇంట్లో కూడా మరో ఇద్దరికి పాజిటివ్‌ రావడంతో వారిని హోంఐసొలేషన్‌లో ఉంచారు. మంగళవారం ఇరురాష్ర్టాల రెసిడెంట్‌ కమిషనర్లు తెలంగాణ భవన్‌తోపాటు ఉద్యోగుల నివాసాలు, పరిసరాలను పరిశీలించారు. 

రాష్ట్రంలో నమోదైన కరోనా కేసులు

వివరాలు
మంగళవారం
మొత్తం
పాజిటివ్‌ కేసులు
879
9,553 
డిశ్చార్జి అయినవారు
219
4,224
మరణాలు
03
220
చికిత్స పొందుతున్నవారు
-5,109


logo