శుక్రవారం 05 మార్చి 2021
Telangana - Jan 17, 2021 , 10:12:26

రాష్ట్రంలో కొత్తగా 299 కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 299 కరోనా కేసులు

హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 299 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,91,666కు చేరింది. ఇందులో 2,85,898 మంది మహమ్మారి బారినుంచి బయటపడగా, 4191 మంది చికిత్స పొందుతున్నారు. మరో 1577 మంది బాధితులు వైరస్‌ ప్రభావంతో మరణించారు. కాగా, నిన్న ఒక్కరోజే 379 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మృతిచెందారు. మొత్తం యాక్టివ్‌ కేసుల్లో 2,395 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 98.02 శాతంగా, మరణాల రేటు 0.54 శాతంగా ఉన్నదని వెల్లడించింది.

కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 57, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 26, కరీంనగర్‌లో 24 కేసుల చొప్పున ఉన్నాయి. రాష్ట్రంలో శనివారంనాడు 33,298 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, దీంతో ఇప్పటివరకు మొత్తం 74,61,687 నమూనాలను పరీక్షించామని తెలిపింది.  

VIDEOS

logo