శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Aug 30, 2020 , 09:53:40

రాష్ట్రంలో కొత్త‌గా 2924 పాజిటివ్ కేసులు

రాష్ట్రంలో కొత్త‌గా 2924 పాజిటివ్ కేసులు

హైద‌రాబాద్‌: రాష్ట్రంలో నిన్న కొత్త‌గా 2,924 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 1,23,090కు చేరింది. ఇందులో 31,284 యాక్టివ్ కేసులు ఉండ‌గా, ఇప్ప‌టివ‌ర‌కు 90,988 మంది బాధితులు కోలుకున్నారు. నిన్న ఒకేరోజు కొత్త‌గా 1,638 మంది క‌రోనా బాధితులు కోలుకుని ఇంటికి చేరారు. అయితే క‌రోనా వ‌ల్ల నిన్న 10 మంది మ‌ర‌ణించ‌డంతో రాష్ట్రంలో మొత్తం క‌రోనా మ‌ర‌ణాలు 818కి చేరాయి. యాక్టివ్ కేసుల్లో 24,716 మంది ఇంటివ‌ద్దే చికిత్స పొందుతున్నారు. 

నిన్న 61,148 మంది క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా, 2924 మంది క‌రోనా పాజిటివ్‌లుగా నిర్ధార‌ణ అయ్య‌రు. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో మొత్తం ‌13,27,791 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేశారు. 

కొత్త‌గా న‌మోదైన పాటివ్ కేసుల్లో అత్య‌ధికంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో 461 కేసులు ఉండ‌గా, రంగారెడ్డి  జిల్లాలో 213, ఖ‌మ్మంలో 181, న‌‌ల్ల‌గొండ జిల్లాలో 171, మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరిలో 153, నిజామాబాద్‌లో 140, సూర్యాపేట‌లో 118, సిద్దిపేట‌లో 97, పెద్ద‌ప‌ల్లిలో 83, రాజ‌న్న సిరిసిల్ల‌లో 55, సంగారెడ్డిలో 44, వికారాబాద్‌లో 15, వ‌న‌ప‌ర్తిలో 46, వ‌రంగ‌ల్ రూర‌ల్‌లో 17, వ‌రంగ‌ల్ అర్బ‌న్‌లో 102, యాదాద్రిలో 64, ఆదిలాబాద్‌లో 36, కొత్త‌గూడెం జిల్లాలో 88, జ‌గిత్యాల‌లో 92, జ‌న‌గామ‌లో 46, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లిలో 24, గ‌ద్వాల జిల్లాలో 35, కామారెడ్డిలో 56, క‌రీంన‌గ‌ర్‌లో 172, ఆసిఫాబాద్ జిల్లాలో 10, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో 58, మహ‌బూబాబాద్‌లో 80, మంచిర్యాల‌లో 91, మెద‌క్‌లో 45, ములుగులో 34, నాగ‌ర్‌క‌ర్నూల్‌లో 51నారాయ‌ణ‌పేట‌లో 13, నిర్మ‌ల్‌లో 33 చొప్పున ఉన్నాయి.  


logo