శనివారం 06 జూన్ 2020
Telangana - May 20, 2020 , 20:35:35

తెలంగాణలో మరో 27 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో మరో 27 కరోనా పాజిటివ్‌ కేసులు

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో బుధవారం కొత్తగా 27 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 15 మంది, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన 12 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,661కు చేరుకుంది. కోవిడ్‌-19 కారణంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 40 మంది మృత్యువాతపడ్డారు. 608 మంది బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 1,013 మంది బాధితులు వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.


logo