తెలంగాణలో కొత్తగా 256 కరోనా కేసులు

హైదరాబాద్ : తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 256 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 298 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇవాళ్టి వరకు మొత్తం 2,92,128 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 2,86,542 మంది చికిత్సకు కోలుకున్నారు. మరో 4,005 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు.
2,283 మంది హోంక్వారంటైన్లో, ఐసోలేషన్ కేంద్రాల్లో ఉన్నారు. 1581 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో నిన్న 31,486 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇప్పటివరకు 75,15,066 శాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో కరోనా మరణాల రేటు కేవలం 0.54 శాతంగా ఉందని పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- గాఢ నిద్రలో ఏనుగు పిల్ల.. తల్లి ఏనుగు ఏమి చేసిందంటే..
- టీచర్‌కు స్టూడెంట్ ఓదార్పు.. వైరల్ అవుతున్న లెటర్
- యువకుడి వేధింపులు.. వివాహిత ఆత్మహత్య.!
- రామ్‌తో కృతిశెట్టి రొమాన్స్..మేకర్స్ ట్వీట్
- కుక్కల దాడిలో 22 గొర్రెలు మృతి
- పెట్రోల్ మంట: భారత విజ్ఞప్తిని పట్టించుకోని సౌదీ అరేబియా
- భృంగివాహనంపై ఊరేగిన ముక్కంటీశుడు
- జగన్‌కు విదేశీ జైలు తప్పదు : నారా లోకేశ్
- జూబ్లీహిల్స్ శ్రీవారి ఆలయ తొలి బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
- మహారాష్ట్రలో కొత్తగా 10,216 కరోనా కేసులు.. 53 మరణాలు