శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Jan 06, 2021 , 02:11:15

రాష్ట్రంలో కొత్తగా 253 కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 253 కరోనా కేసులు

హైదరాబాద్‌, జనవరి 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సోమవారం 42 వేల కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 253 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,87,993కు చేరుకున్నట్టు మంగళవారం వైద్యారోగ్యశాఖ బులెటిన్‌ వెల్లడించింది. కరోనాతో ఒక్కరోజే ముగ్గురు మృతిచెందారు. మొత్తం మరణాల సంఖ్య 1,554కు చేరుకున్నది. జాతీయ సగటు రికవరీశాతం 96.03 శాతం ఉండగా.. రాష్ట్ర రికవరీ రేటు 97.71 శాతంగా నమోదైంది. ఏపీలో గడిచిన 24 గంటల్లో 51,420 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 377 కొత్త కేసులు నమోదయ్యాయి.

వివరాలు
సోమవారం
మొత్తం 
పాజిటివ్‌ కేసులు
253
2,87,993
డిశ్చార్జీ అయినవారు
317
2,81,400
మరణాలు
31,554
చికిత్స పొందుతున్నవారు
-5,039


logo